ఇంటర్వ్యూ : నటాషా దోషి- నన్ను యువరాణి లా చూసుకుంటారు.

బాలకృష్ణ హీరోగా కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జై సింహ. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో నటాషా దోసి ఒక హీరోయిన్ గా నటించిది. ఈ సందర్భంగా హీరోయిన్ నటాషా దోషి తో ఇంటర్వ్యూ..

మీ గురించి ?

మాది ముంబాయి. జై సింహ నా మొదటి తెలుగు చిత్రం. సినిమాల్లోకి రాకముందు నేను ఒక డెంటిస్ట్. నటన నా ఫ్యాషన్ కావున ఈ రంగంలోకి రావడం జరిగింది.

జై సింహలో మీ పాత్ర గురించి ?

నా పాత్ర పేరు ధన్య. మురళి మోహన్ గారికి కూతురిగా నటించాను. ఈ చిత్రంలో చాలా కాలం తరువాత నేను పుట్టాను కాబట్టి నన్ను యువరాణి లా చూసుకుంటాడు మా నాన్న యు.ఎస్ నుండి నా స్వస్థలం కుంభకోణం కు వచ్చాక ఏం జరిగింది అనేది కీలకం.

మీ మొదటి సినిమా ?

మలయాళంలో రెండు చిత్రాల్లో నటించాను. అక్కడ నా మొదటి సినిమా పేరు మంత్రికన్. జయరాం గారితో కలిసి పనిచేశాను. మా అమ్మ మలియాలి కాబట్టి నాకు మలయాళం బాగా వచ్చు.

ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది ?

కళ్యాణ్ గారు , డైరెక్టర్ గారు నా పాత్ర కోసం చూస్తున్నపుడు నేను అప్రోచ్ అయ్యాను. చాలా మంది అమ్మాయిలను చూసాక నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పాత్ర నేను చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాను.

ఈ సినిమాలో మీ పాట గురించి ?

అమ్మకుట్టి పాటలో నా డాన్స్ బాగుంటుంది. నేను బేసిక్ గా డాన్సర్ అవ్వడంతో ఈజీగా అనిపించింది. స్క్రీన్ పై నా యాక్టింగ్ పెర్ఫార్మన్స్ అందరికి నచ్చుతుంది.

బాలకృష్ణ గారి గురించి ?

నేను బాలకృష్ణ గారి తెలుగు సినిమాలు చూడలేదు కానీ ఆయన సినిమాలు హిందీ లో డబ్ అయ్యాయి ఆ మూవీస్ చూసాను. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి కలిగించింది. నటిస్తున్నప్పుడు ఆయన దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నా.

డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ గురించి ?

డైరెక్టర్ రవికుమార్ గారు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఆయన చెప్పిన విధానం. కథలో ట్విస్ట్ నన్ను ఈ సినిమాలో నటించేలా చేశాయి. సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నాను.