ఆకట్టుకుంటున్న “ఇంటింటి రామాయణం” టీజర్

ఆకట్టుకుంటున్న “ఇంటింటి రామాయణం” టీజర్

Published on Nov 25, 2022 3:00 PM IST

కొన్ని రోజుల క్రితం ఆహా ఇంటింటి రామాయణం అనే వెబ్ మూవీని అనౌన్స్ చేసింది. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పుడు విడుదలైంది. టీజర్ కూల్ అండ్ ఫన్నీగా కనిపిస్తోంది. మేకర్స్ కథ గురించి పెద్దగా వెల్లడించలేదు కానీ నరేష్ కుటుంబంలో విభిన్నమైన లక్షణాలున్న వ్యక్తులు ఉన్నారని టీజర్ సూచిస్తుంది. వెబ్ సినిమా గురించి మరింత సమాచారం తెలియాలంటే ట్రైలర్ కోసం వేచి ఉండాలి. టీజర్ ఆద్యంతం ఆసక్తికరం గా సాగుతూ, విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఆహా వీడియో డిసెంబర్ 16, 2022న ఇంటింటి రామాయణం తన ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ చిత్రం తో సురేష్ నరెడ్ల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. నరేష్, నవ్య స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ విలేజ్ డ్రామాను మారుతి మరియు IVY ప్రొడక్షన్స్ ల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ వెబ్ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు