మహేష్ బాబు SSMB 28 ఫస్ట్ గ్లింప్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ?

Published on May 16, 2023 3:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB 28 పై మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో దాదాపుగా పుష్కర కాలం తరువాత వస్తున్న మూవీ కావడంతో దీని పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఐతే క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ మూవీ నుండి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. దానికి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రానున్న మే 31న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

కాగా విషయం ఏమిటంటే, ఈ గ్లింప్స్ యొక్క లెంగ్త్ 80 సెకండ్స్ వరకు ఉండనుండగా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్ తో పాటు మాస్ యాక్షన్ సీన్స్, ఒక డైలాగ్ ఉండనున్నట్లు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో క్రేజీ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా ఈ మూవీని సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :