ప్రభాస్ – మారుతీ మూవీ పై ఇంట్రెస్టింగ్ బజ్ …?

Published on Aug 17, 2022 2:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజక్ట్ కె మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీస్ లో ఆదిపురుష్ 2023 జనవరికి, అలానే సలార్ 2023 సెప్టెంబర్ చివర్లో, ఇక ప్రాజక్ట్ కె 2024 బిగినింగ్ లో ఆడియన్స్ ముందుకు రానున్నాయి. ఈ సినిమాల తరువాత యువ దర్శకుడు మారుతీ తో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారు ప్రభాస్. తమ కాంబో మూవీ పై ఇటీవల మారుతీ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వగా, ఈ క్రేజీ కాంబో మూవీ పై లేటెస్ట్ గా ఒక ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.

ఈ మూవీకి టాలీవుడ్ కి చెందిన రెండు ప్రముఖ ప్రొడక్షన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయని, త్వరలోనే వీటికి సంబంధించి అఫీషియల్ గా పూర్తి వివరాలు వెల్లడికానున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ తో పాటు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలు అన్ని జోడించి దర్శకుడు మారుతీ ఈ మూవీ స్టోరీని సిద్ధం చేస్తున్నారట. తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరి మెప్పు పొందేలా ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారట మారుతీ.

సంబంధిత సమాచారం :