రామ్ చరణ్ నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడే?

Published on Nov 20, 2023 12:01 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా రిలీజ్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. అదే విధంగా ఉప్పెన చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు తో రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ను ఫిక్స్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు ల సినిమా త్వరలో స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జనవరి నెలలో లేదా, ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తరువాత రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు ల సినిమా షురూ కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమాకి సంబందించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :