రామ్ చరణ్ మూవీలో టైగర్ ష్రాఫ్?

Published on Sep 17, 2023 11:01 pm IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ఇమేజ్ కి తగిన విధంగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత RC 16 ను ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో నటించనున్నారు చరణ్.

ఈ చిత్రం పై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. రా అండ్ రస్టిక్ గా సినిమా ఉంటుంది అని, స్పోర్ట్స్ నేపథ్యం లో చిత్రం ఉంటుంది అని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ సినిమా లో ప్రముఖ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించనున్నారు. ఈ చిత్రం లో విలన్ పాత్ర కి టైగర్ ష్రాఫ్ అయితే కరెక్ట్ గా సరిపోతారు అని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

సంబంధిత సమాచారం :