RC15 ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

RC15 ఆల్బమ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

Published on Nov 11, 2022 1:34 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ డైరెక్టర్ శంకర్ ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ RC15. త్వరలో టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కానున్న ఈ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తుండగా కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అందరిలో ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉండడంతో పాటు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే తప్పకుండా చరణ్ ఈ మూవీతో భారీ హిట్ కొట్టడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. అంజలి, సినీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

తనకు ఇష్టమైన దర్శకడు మరియు గువురు అయిన శంకర్ తో వర్క్ చేస్తున్న మూవీ కావడంతో సాంగ్స్ తో పాటు బీజీఎమ్ విషయమై కూడా థమన్ ఎంతో శ్రమపడుతున్నారని, మరీ ముఖ్యంగా ఈ మూవీలో మొత్తం సాంగ్స్ అన్ని కూడా సూపర్ గా ట్యూన్ చేయబడ్డాయనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక శంకర్ మూవీస్ లో సాంగ్స్ ఆడియో పరంగానే కాక విజువల్ గా కూడా ఎంతో గ్రాండియర్ గా ఉంటాయి. అలానే ఈ మూవీ సాంగ్స్ ని కూడా భారీ స్థాయిలో చిత్రీకరించారట శంకర్. మొత్తంగా ఈ మూవీ పై అందరిలో రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతుండడంతో వచ్చే ఏడాది వేసవిలో రానున్న RC15 మూవీ ఆడియన్స్ అంచనాలు ఖచ్చితంగా అందుకుంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు