సిద్ధు, నందిని రెడ్డి సినిమా పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on May 27, 2023 3:00 am IST

టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఇటీవలే అన్నీ మంచి శకునములే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె తన నెక్స్ట్ మూవిని యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి చేయనున్న విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ చిత్రం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. బివిఎస్ రవి కథ అందించనున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

సిద్ధు జొన్నలగడ్డకు యువతలో మంచి క్రేజ్ ఉంది, మరియు అతను సరసన సమంత కన్ఫర్మ్ గా ఉంటే సినిమా పై మరింత హైప్ ఉండే అవకాశం ఉంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలను అందించిన నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్ధు నటించడం. సమంత ఇప్పటికే నందిని రెడ్డితో కలిసి ఓహ్ బేబీ సినిమాను చేయడం జరిగింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించగా, త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :