విజయ్ – గౌతమ్ తిన్ననూరి మూవీ లో హీరోయిన్ ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్ (Family star) మూవీ తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఈ చిత్రం అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది అని చెప్పాలి. విజయ్ తదుపరి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో VD12 అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రం కి టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది.

అయితే ఈ చిత్రం లో విజయ్ సరసన హీరోయిన్ గా ఎవరనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ బజ్ ప్రకారం, మేకర్స్ ప్రేమలులోని మమితా బైజుని మహిళా ప్రధాన పాత్రలో తీసుకోవాలని యోచిస్తున్నట్లు సూచిస్తుంది. మరోవైపు, మిస్టర్ బచ్చన్ హీరోయిన్, భాగ్యశ్రీ బోర్స్ కూడా పాత్ర కోసం పరిశీలనలో ఉంది. మరి విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం ఎవరికి వస్తుందో వేచి చూడాలి. ఈ స్పై థ్రిల్లర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ మరియు సాయి సౌజన్య లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version