లేటెస్ట్ : ఎన్టీఆర్ లుక్ పై ఆసక్తికర చర్చ …. !

Published on Jul 31, 2022 12:10 am IST

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివతో తన కెరీర్ 30వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థల పై ఎంతో భారీ ఎత్తున రూపొందనున్న ఈ మూవీ భారీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుండగా యువ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం అందించనున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.

అయితే కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది .ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేసారు కాగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ ని గమనిస్తే ఫుల్ గా గడ్డంతో పాటు ఒకింత రఫ్ లుక్ లో ఆయన కనిపించారు. కాగా ఆయన లుక్ పై ప్రస్తుతం ఫ్యాన్స్ లో అలానే ఆడియన్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే కొరటాల మూవీలోని క్యారెక్టర్ కోసమే ఎన్టీఆర్ ఈ లుక్ లో సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనుండగా, హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కనున్న ఈ మూవీ అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :