యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం VD14. ఈ చిత్రానికి టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ తమ కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయ్ తో గతంలో టాక్సీవాలా అనే చిత్రాన్ని డైరక్ట్ చేసిన రాహుల్ ఇప్పుడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజైన కాన్సెప్ట్ పోస్టర్ ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో ఆసక్తిని కలిగించింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం లో ఫిమేల్ లీడ్ రోల్ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించనున్నది. అయితే ఈ న్యూస్ పై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఇప్పటికే డియర్ కామ్రేడ్ మరియు గీత గోవిందం చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇది వారికి హ్యాట్రిక్ చిత్రం అని చెప్పాలి. అక్టోబర్ లో ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ చిత్రం కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇది 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగే కథ అని పోస్టర్ లో పేర్కొన్నారు. తెలుగు తో పాటుగా, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.