RC16 కోసం కొత్త యాస నేర్చుకోనున్న రామ్ చరణ్!

Published on May 1, 2023 3:00 pm IST

RRR చిత్రంతో వరల్డ్ వైడ్ గా క్రేజ్ తోచ్చుకొని గ్లోబల్ స్టార్ గా మారిపోయారు రామ్ చరణ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్. ఇదొక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. అయితే తన నెక్స్ట్ మూవీ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా తో చేయనున్నారు. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ పై రామ్ గోపాల్ చాలా గట్టి నమ్మకం తో ఉన్నారు. ఈ చిత్రం గురించి ఇప్పటికే రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్‌ అని పేర్కొన్నారు.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నాడు. అందుకోసం చరణ్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడని తెలుస్తోంది. అతను తన బాడీ లాంగ్వేజ్‌పై కూడా ఫోకస్ చేయనున్నారు. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు రంగస్థలం చిత్రానికి AD గా పనిచేశాడు. చరణ్ నుండి బెస్ట్ వర్క్ ను పొందడానికి ఆ అనుభవం ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :