బాలయ్య 108 టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

బాలయ్య 108 టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Published on May 30, 2023 5:26 PM IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఒక యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి భారీ అంచనాలు కలిగిన ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో బజ్ గా మారింది. ఈ ప్రతిష్టాత్మక మూవీకి భగవత్ కేసరి అనే టైటిల్ ని యూనిట్ పరిశీలిస్తోందట. అయితే పక్కాగా ఇదే టైటిల్ గా ఫిక్స్ చేస్తారా లేదా మరొకటి ఉంటుందా అనేది తెలియాలి అంటే మేకర్స్ నుండి దీని పై అఫీషియల్ గా ప్రకటన రావాల్సిందే. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని, తప్పకుండా బాలయ్య, అనిల్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మూవీని రానున్న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు