ప్రభాస్ – మారుతి మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ?

Published on May 19, 2023 8:18 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న మూడు సినిమాల్లో మారుతీ తీస్తున్న ఫామిలీ యాక్షన్ కమర్షియల్ మూవీ కూడా ఒకటి. భారీ స్థాయిలో ప్రముఖ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈమూవీ ఇప్పటికే కొంత మేర షూటింగ్ జరుపుకోగా ఇందులో ప్రభాస్ కి తాతయ్య పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపించనున్నారని తెలుస్తోంది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఈ మూవీలో ప్రభాస్ లుక్ మంచి యూత్ ఫుల్ గా ఉంటుందని, అలానే ఈ మూవీలో లైట్ గా గడ్డంతో పాటు ట్రెండీ స్టైల్ కాస్ట్యూమ్స్ తో ప్రభాస్ అదరగొట్టడం ఖాయం అని బజ్. ముఖ్యంగా ఈ సినిమా యువత, మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకోవడం ఖాయం అట. కాగా ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో మూవీ యూనిట్ నుండి వరుసగా రానున్నాయి.

సంబంధిత సమాచారం :