మహేష్ 28 టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Published on May 15, 2023 8:45 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న SSMB 28 మూవీ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మహేష్ బాబు ఈ నెలాఖరులో తిరిగిరానుండగా మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ని జూన్ మొదటి వారంలో ఆరంబించనున్నారట. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో జగపతి బాబు నెగటివ్ రోల్ చేస్తుండగా దీనిని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

విషయం ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక మూవీ టైటిల్ కి సంబంధించి ఇప్పటికే ఒక న్యూస్ వైరల్ అవుతోంది. దాని ప్రకారం మూవీ కోసం అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం అనే టైటిల్స్ ని యూనిట్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఈ రెండింటితో పాటు మరొక టైటిల్ ని కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇక మే 31న సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తో పాటు అఫీషియల్ గా టైటిల్ ని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని 2024 జనవరి 13న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :