పవన్, సాయి తేజ్ ల “బ్రో” నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Jun 2, 2023 2:16 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయిక గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం సోమవారం నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పాటల చిత్రీకరణ జరగనుంది.

ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బ్రో చిత్రం లో బ్రహ్మానందం, సుబ్బరాజు, రోహిణి మొల్లేటి, తనికెళ్ల భరణి మరియు ఇతరులు కూడా ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :