త్రిష నెక్స్ట్ మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Sep 13, 2023 2:06 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియోలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన తదుపరి చిత్రం లేటెస్ట్ అప్డేట్‌ ఇక్కడ ఉంది. లియో కంటే ముందు, త్రిష ది రోడ్‌లో కనిపించనుంది. ఇది రివెంజ్ డ్రామా గా తెరకెక్కుతోంది.

అక్టోబర్ 6, 2023న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్‌ను సెప్టెంబర్ 14, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ను ఆవిష్కరించారు. అరుణ్ వసీగరన్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్‌గా పేరుగాంచిన షబీర్ కీలక పాత్రలో నటించారు. ఎఎఎ సినిమా నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :