యాక్షన్ మోడ్ లోకి వచ్చేసిన పవన్ “ఉస్తాద్ భగత్ సింగ్”

Published on Sep 7, 2023 4:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన ప్రచార చిత్రాలు రిలీజై ప్రేక్షకులను, అభిమానులని అలరించాయి. తాజాగా ఈ చిత్రం కి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ నేడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాసివ్ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు తెలిపారు. పవర్ ప్యాక్డ్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది అని పేర్కొన్నారు. శ్రీ లీల లేడి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :