పంజా వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ మూవీ కి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్!

Published on May 11, 2023 2:30 pm IST

శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా గతేడాది పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాత్కాలికంగా PVT 04 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక గా నటిస్తుంది. మేకర్స్ వరుస అప్డేట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిన్న, వజ్ర కాళేశ్వరి దేవ్ పాత్రను పోషించడానికి టాలెంటెడ్ నటి అపర్ణా దాస్ ఆన్‌బోర్డ్‌లోకి వచ్చినట్లు వారు ప్రకటించారు.

ఈ చిత్రానికి అద్భుతమైన సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు ఈరోజు చిత్రబృందం ప్రకటించింది. సార్/వాతి విజయం తర్వాత, సితార ఎంటర్టైన్‌మెంట్స్‌తో కంపోజర్‌కి ఇది రెండో చిత్రం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్‌ను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌లో జోజు జార్జ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌ సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :