రామ్ – బోయపాటి సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

రామ్ – బోయపాటి సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Jun 6, 2023 12:30 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ మైసూర్ లో నేటి నుండి ప్రారంభం అయ్యింది. ఇప్పటి వరకూ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. కాగా, ఒక సాంగ్ ను షూట్ చేయనున్నారు మేకర్స్. ఇది జూన్ 15 వ తేది వరకు కొనసాగనుంది.

శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై నిర్మిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 20, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు