“ఉస్తాద్ భగత్ సింగ్” మాసివ్ యాక్షన్ షెడ్యూల్ పై లేటెస్ట్ అప్డేట్!

Published on Sep 4, 2023 11:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ చిత్రం కి సంబందించిన నెక్స్ట్ షెడ్యూల్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మాసివ్ యాక్షన్ షెడ్యూల్ రేపటి నుండి (మంగళవారం) నుండి షురూ కానుంది. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక ఫోటో ను రిలీజ్ చేశారు. సినిమాలో వాడే వెపన్స్ తో హరీష్ శంకర్ పోజులిచ్చారు. ఈ ఫోటో కి డైరెక్టర్ హరీష్ శంకర్ కామెంట్స్ చేశారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :