అన్నీ నేనే డిసైడ్ చేస్తానంటున్న రానా !


స్టార్ నటుడు రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ యొక్క టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ టీజర్ చూస్తే సినిమా పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా ఉండనుందనే సంగతి ఇట్టే అర్థమవుతోంది. అంతేగాకా రాజకీయనాయకుడిగా రానా లుక్ కూడా గంభీరంగా, ఆసక్తికరంగా ఉంది.
ముఖ్యంగా ‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా’ అంటూ రానా చెప్పిన డైలాగ్ సినిమా సబ్జెక్ట్ పై మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ‘చిత్రం, నువ్వు నేను, జయం, నిజం’ వంటి సినిమాలతో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన తేజ చాలా కాలం తర్వాత దర్శకత్వం చేస్తున్న ఈ సినిమాలో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.