సామ్ సినిమాపై ఐపీఎల్ ఎఫెక్ట్ నిజమేనా!?

Maa Inti Bangaram

స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘మా ఇంటి బంగారం’. తెలుగులో చాలా కాలం తర్వాత ఆమె నుంచి వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిపై మంచి బజ్ అయితే నెలకొంది. కానీ ఈ సినిమా ఈపాటికే విడుదల కావాల్సి ఉంది కానీ మేకర్స్ మే 15కి లాక్ చేసారు. కానీ ఇక్కడ నుంచి మరో నెల జూన్ కి వాయిదా పడినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

అయితే దీనికి కారణం ఐపీఎల్ ఎఫెక్ట్ అని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి నిజంగానే ఐపీఎల్ లు ఈ రేంజ్ లో సినిమా రిలీజ్ లకి కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయా? మరీ చిన్న సినిమాలు అంటే ఓకే అనుకోవచ్చు కానీ సమంత రేంజ్ హీరోయిన్స్ సినిమాలు కూడా వాయిదా అంటే ఒకింత ఆలోచించాల్సిందే మరి. అయితే ఈ వాయిదాకి నిజంగానే ఐపీఎల్ కారణమా లేక మరోటి ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సమంత నిర్మాణం వహించింది.

Exit mobile version