హీరోయిన్ గా స్టార్ హీరో కుమార్తె !

హీరోయిన్ గా స్టార్ హీరో కుమార్తె !

Published on Dec 12, 2022 10:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ‘ఐరాఖాన్’ హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. ఇప్పటికే నుపుర్ శిఖారే అనే ఫిట్ నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడి, అతనితో పెళ్లికి కూడా సిద్ధ పడిన ఐరాఖాన్ త్వరలో సినిమాల్లోకి కూడా అడుగుపెట్టాలని ఆశ పడుతుంది. ఆమె కోసం ప్రస్తుతం అమీర్ ఖాన్ కథలు కూడా వింటున్నాడట. మరి ఐరాఖాన్ తన తండ్రి అమీర్ లా అద్భుతంగా నటించగలదా ?, తన తండ్రిలా బాలీవుడ్ లో స్టార్ డమ్ తెచ్చుకోగలదా ? చూడాలి.

కాగా హిందీలో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు అమీర్ ఖాన్. కాగా అలాంటి అమీర్ కూతురు ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని వార్తలు రావడంతో.. అమీర్ అభిమానులు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఐరాఖాన్ కి శుభాకాంక్షలు అని, ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. మరి ఐరాఖాన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు