హాట్ స్టార్ లో ఆకట్టుకుంటున్న “ఐరావతం”

హాట్ స్టార్ లో ఆకట్టుకుంటున్న “ఐరావతం”

Published on Nov 29, 2022 8:16 AM IST

ఎస్తేర్ నోహ, అమర్ దీప్, అరుణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఐరావతం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నూజివీడు టాకీస్ అనే బ్యానర్ పైన గుణశేఖర్ శిష్యుడైన సూహాస్ మీరా ఈ మూవీ ని డైరెక్ట్ చేశారు. రేఖ పలగాని సమర్పణలో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి, లలిత కుమారి తోట నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫ్యూజన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఐరావతం మూవీ ఈ నెల 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో ఎస్తేర్, అమర్ దీప్, తన్వి నెగ్గి అరుణ్ ల డబుల్ షేడ్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ట్రిక్కీ స్క్రీన్ ప్లే తో గమ్మత్తైన కథ మూవీ చివరి వరకు యంగేజ్ చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఇంట్రెస్టింగ్ రీ రికార్డింగ్ మరియు మూడ్ లైటింగ్ ఇంకా బాగా ఇన్వాల్ అయ్యేట్టు చేస్తాయి.

నిర్మాతలు మాట్లాడుతూ, “సుహాస్ మాకు ఆటవిడుపు గా ఐరావతం కథ చెప్తే విని ఈ కథ లోని స్క్రీన్ ప్లే స్ట్రాటజీ నచ్చి మూవీ తీద్దాం అనుకున్నాం. చివరికి ఈ మూవీ హాట్ స్టార్ కి నచ్చి తీసుకోవడం అనుకోకుండా టాప్ వన్ లో రెండు వారాలుగా ఉండటం జరుగుతుంది.ఒక మంచి కథ ని నమ్మినందుకు చాలా హ్యాపీ గా ఉన్నాం” అని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, “ఫ్యూజన్ జోనర్ లో తీసిన ఐరావతం హాట్ స్టార్ ప్రేక్షకులకు నచ్చడం చాలా హ్యాపీ. నిర్మాతలకు థాంక్స్. టెక్నీషియన్స్ కు థాంక్స్” అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు