మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో తెలుగు సినిమా నుండి వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.
ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ చిత్రం తొలిరోజే రూ. 7.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. రవితేజ కెరీర్లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్ కావడం విశేషం. ఎలాంటి పెయిడ్ ప్రీమియర్లు లేకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఈ సినిమా సక్సెస్ రేంజ్ తెలియజేస్తోంది.
ఇక ఈ వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించే దిశగా సాగుతోంది.
