మాస్ మహారాజ రవితేజ నటించిన సెన్సేషనల్ కంబ్యాక్ హిట్ చిత్రమే “ఇరుముడి”. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సూపర్ హిట్ సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా మారింది. వారం రోజులు దాటినా అంతకు మించిన బుకింగ్స్ తో దుమ్ము లేపుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తున్న ఈ సినిమా ఈ 8 రోజుల్లో 150 కోట్లకి పైగా గ్రాస్ ని సొంతం చేసుకొని స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.
ఇక ఈ వీకెండ్ లో సుమారు 200 కోట్ల మేర గ్రాస్ ని కూడా ఈ సినిమా అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. మొన్నటికి నిన్నటికే ఈజీగా 15 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా నేడు శనివారం అంతకు మించిన బుకింగ్స్ ని కనబరుస్తుంది. ఇదే ఊపులో ఆదివారం కూడా కొనసాగడం గ్యారెంటీ. ఇలా చూసుకున్నా రెండు రోజుల్లో తక్కువలో తక్కువ 40 కోట్ల గ్రాస్ గ్యారెంటీ సో 200 కోట్ల మార్క్ దగ్గరకి వచ్చే ఛాన్స్ తప్పకుండా ఉంది.
సో మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర ఇరుముడి కనక వర్షం కురిపిస్తోంది అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషించింది. అలాగే జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
