‘ఇరుముడి’ నైజాం కలెక్షన్స్.. 9 రోజుల్లో సాధించిన వసూళ్లు ఇవే !

‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తగ్గకుండా సంచలనాత్మక ప్రదర్శనను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఒక భారతీయ చిత్రానికి సంబంధించి 24 గంటల్లో అత్యధిక టికెట్ అమ్మకాలను నమోదు చేసిందన్న వార్తల తర్వాత, ఈ బ్లాక్‌ బస్టర్ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. రిలీజ్ అయిన 9వ రోజు కూడా ఈ చిత్రం బలమైన ప్రదర్శనను కనబరిచింది, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఈ సినిమా జోరు అద్భుతంగా ఉంది.

నైజాంలో ‘టాక్సిక్’ చిత్రానికి కేటాయించిన అనేక థియేటర్లలో తిరిగి ‘ఇరుముడి’ని ప్రదర్శిస్తున్నారు. ఇక కేవలం 9 రోజుల్లోనే నైజాం ప్రాంతంలో ఈ చిత్రం సుమారు రూ. 36 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ డ్రామా మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version