డిసెంబర్ లో విడుదల కానున్న “ఆచార్య”?

Published on Oct 4, 2021 4:45 pm IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ చిత్రం విడుదల కోసం మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం లో రామ్ చరణ్ మరియు పూజా హెగ్డే లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మరియు మ్యాట్ని ఎంటర్ టైన్మెంట్ పతాకం పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై ఆసక్తి రేకెత్తించే విధంగా ఉన్నాయి.

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ పై సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప సైతం ఇదే నెలలో విడుదల కానుంది. ఆచార్య చిత్రం విడుదల తేదీ పై చిత్ర యూనిట్ త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :