బజ్..అజిత్ సినిమాలో ఆది? ఎంతవరకు నిజం.?

Published on May 14, 2022 12:13 am IST


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “వలిమై” తో తన కెరీర్ లో మరో హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అనంతరం మళ్ళీ ఆ సినిమా దర్శకుడు హెచ్ వినోద్ తోనే ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని అజిత్ ఒక సరికొత్త లుక్ లో స్టార్ట్ చేసేసారు.

మరి రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ లో ఒక్కో నటుల పేర్లు వినిపిస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా ఆఫ్ సెట్స్ నుంచి ప్రముఖ నటుడు ఆదిపినిశెట్టి మరియు అజిత్ కలిసి ఉన్న ఒక ఫోటో బయటకొచ్చి మంచి వైరల్ అవుతుంది.

అయితే ఇది ఏ సందర్భ కలయికనో కానీ ప్రస్తుతం అయితే అజిత్ సినిమాలో ఆది ఉన్నట్టుగా టాక్ ప్రచారం జరుగుతుంది. అలాగే ఇది పక్కన పెడితే మరోపక్క అజిత్ సినిమాలో విలన్ గా ఆది చేస్తున్నాడని అంటున్నారు. మరి ఇందులో ఎంతమేర నిజముందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మంజు వారియర్ నటిస్తుండగా బోణి కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :