“ఆదిపురుష్” లేటెస్ట్ పోస్టర్స్..మూడో సాంగ్ అప్డేటా ఇది.?

Published on Jun 2, 2023 8:01 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో చేసిన భారీ చిత్రం “ఆదిపురుష్” కోసం ఆడియెన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ఈ భారీ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు కూడా సెన్సేషనల్ హిట్స్ కాగా మరిన్ని సాంగ్స్ కోసం అయితే ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు.

ఇక టీం అయితే సడెన్ సడెన్ గా అప్డేట్స్ ని ఇస్తుండడం ఫ్యాన్స్ కి కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. రెండో సాంగ్ కి కూడా ఎలాంటి అలర్ట్స్ లేకుండా డైరెక్ట్ గా ఇన్ని రోజులు ఉంది అంటూ అప్డేట్ రివీల్ చేసారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా హనుమాన్ పై పవర్ ఫుల్ పోస్టర్స్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసి మూడో సాంగ్ రిలీజ్ చేస్తున్నారా అన్నట్టు అన్ని భాషల్లో సాంగ్ అప్డేట్ లా ఓ లైన్ కూడా రివీల్ చేశారు.

తెలుగులో “శకెత వంతుల్ం, భకెత మంతుల్ం” అంటూ రివీల్ హనుమాన్ పై సాంగ్ అప్డేట్ అన్నట్టు అర్ధం చేసుకోవాలా అనుకుంటే పోస్టర్ పై సాంగ్ కోసం ఏమీ లేదు. ఈ రకంగా అయితే ఆదిపురుష్ నుంచి ప్రస్తుతం అప్డేట్స్ వస్తున్నాయి. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :