“ఆదిపురుష్” ప్రీపోన్..ఎంతవరకు నిజం?

Published on May 6, 2023 12:07 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ చిత్రం “ఆదిపురుష్” నామ జపమే ఇండియన్ సినిమా దగ్గర వినిపిస్తుంది. టీజర్ వచ్చాక ఎంత స్థాయిలో నెగిటివిటీ వచ్చిందో ఇప్పుడు ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వాతావరణం నెలకొంది. ఇక ఇప్పుడు అంతా ఎంతో ఆసక్తిగా థియేట్రికల్ ట్రైలర్ కోసం చూస్తుండగా ఈ ట్రైలర్ రిలీజ్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీస్ పై ఓ షాకింగ్ రూమర్ అయితే వినిపిస్తుంది.

ఈ సినిమా జూన్ 16 కంటే ముందే రిలీజ్ అయిపోతుంది అని బాలీవుడ్ వర్గాల్లో అంటున్నారట. బహుశా షారుఖ్ జవాన్ డేట్ జూన్ 2 న అయితే ఆదిపురుష్ వస్తుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఎలాగో సమయం ఉంది, జవాన్ కూడా డేట్ మారొచ్చు అని స్ట్రాంగ్ ఉంది కాబట్టి కాస్త ముందే వచ్చినా ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం :