2.0 లో ఆసక్తి రేపుతున్న అమీజాక్సన్ పాత్ర !
Published on Oct 11, 2017 11:33 pm IST


భారత చలనచిత్ర రంగంలో కనీవినీ ఎరుగని బడ్జెట్ తో భారీ స్థాయిలో రజినీకాంత్ 2.0 చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈచిత్రంలో అమీ జాక్సన్ కథ నాయికగా నటిస్తోంది. అమీజాక్సన్ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ లో అమీజాక్సన్ రోబోలా కనిపిస్తోంది. దీనితో అమీజాక్సన్ రోబోనా లేక సాధారణ మహిళా అనే ఆసక్తి నెలకొని ఉంది.

మేకింగ్ వీడియోలో అమీజాక్సన్ సాధారణ మహిళగా కనిపించింది. ఈ చిత్రం లో రజినీకాంత్ శాత్రవేత్తగా, రోబోగా కనిపించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ప్రస్తుతం శంకర్ అమీజాక్సన్, రజినీకాంత్ లపై ఓ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. దీనితో ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తికానుంది.

 
Like us on Facebook