ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందా?

ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుందా?

Published on Dec 25, 2022 6:13 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో అయితే పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియా, పాన్ వరల్డ్ వరకు కూడా భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రాల్లో వరల్డ్ లెవెల్ హంగులతో తెరకెక్కుతున్న సెన్సేషనల్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. మరి ఈ చిత్రం షూట్ శరవేగంగా కంప్లీట్ అవుతూ ఉండగా దీనిపై అయితే ఓ లేటెస్ట్ న్యూస్ బయటకి వచ్చింది.

అతి త్వరలోనే ఈ సినిమా నుంచి అయితే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని దర్శకుడు నాగశ్విన్ రివీల్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇది బహుశా జనవరి మొదటి వారంలోనే ఉండొచ్చని కూడా సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమా ఓ యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ ఉండగా బాలీవుడ్ స్టార్ బిగ్ బి అమితాబ్ మరియు దీపికా పదుకొనె లు నటిస్తుండగా దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని 500 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు