టాలీవుడ్ వరుస విజయ సినిమాల దర్శకుడు అనీల్ రావిపూడి అంటే మొదట గుర్తొచ్చేది తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలే.. అదే తన స్ట్రాంగ్ జోన్ అని కూడా తాను పలుమార్లు చెప్పారు. ఇలా తనకి బాగా వచ్చిన ట్రాక్ లోనే సినిమాలు చేస్తూ వచ్చిన అనీల్ ఇప్పుడు ట్రాక్ మారుస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఈసారి పూర్తిగా తన ఫార్మాట్ కి విరుద్ధంగా ఓ యానిమేషన్ సినిమా చేయనున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా రామాయణం లాంటి ప్రాజెక్ట్ ని తను టేకప్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యకరమైన విషయమే అని చెప్పాలి. కేవలం కామెడీ మాత్రమే కాకుండా భగవంత్ కేసరి లాంటి సాలిడ్ సీరియస్ సబ్జెక్ట్ లు తను చెయ్యగలరు అని ఆల్రెడీ ప్రూవ్ చేశారు.
సో ఇది కూడా చేసినా ఆశ్చర్యం లేదు. మరి ఈ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ పై మాత్రం మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం అనీల్ హీరోలు వెంకీ మామా, తన మొదటి హీరో కళ్యాణ్ రామ్ లతో జనవరి 12 విడుదల సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
