బజ్..”RRR” నుంచి మరో బిగ్ అప్డేట్ రానుందా.?

Published on Sep 11, 2021 6:02 pm IST

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతో కాలంగా మోస్ట్ అవైటెడ్ గా ఉన్న చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ఒకటి. మరి ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ లేదని మేకర్స్ కొన్ని గంటల కితమే అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా రిలీజ్ పై మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనిపై కూడా కీలక అప్డేట్ ని ఇచ్చారు. అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు దీనిని మించి మరో శాలి అప్డేట్ రానున్నట్టుగా బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రానున్నట్టు తెలుస్తుంది. మరి బహుశా దీనిని కూడా మేకర్స్ తొందరలోనే అనౌన్స్ చేసే సూచనలు ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే కీరవాణి ఇచ్చిన ఫస్ట్ సింగిల్ “దోస్తీ” సాంగ్ పెద్ద చార్ట్ బస్టర్ అయ్యింది. మరి ఈసారి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని వినిపిస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :