చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ నుంచి మరో అప్డేట్ రానుందా?

Published on Sep 9, 2021 2:01 pm IST


ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా మరిన్ని భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబోలో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం కూడా ఒకటి. నిన్న జస్ట్ అనౌన్సమెంట్ నే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసిన శంకర్ ఇక నుంచి రెగ్యూలర్ షూట్ వేటలో బిజీ కానున్నారు. అయితే ఇదిలా ఉండగా నిన్న ఊహించని విధంగా ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని డిజైన్ చేయించి లాంచ్ చేసిన శంకర్ విపరీతమైన హైప్ ని తెచ్చుకోగలిగారు.

అయితే మరి ఇప్పుడు ఈ కాంబోపై మరో అప్డేట్ కూడా వినిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఈవెంట్ మరియు సినిమా పోస్టర్ కి సంబంధించి ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తున్నట్టుగా బజ్ వినిపిస్తుంది. బహుశా దానిని తొందరలోనే రిలీజ్ చేస్తారట. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :