“వకీల్ సాబ్” కు మరో లీక్ బెడద అంటుకుందా.?

vakeel saab

ప్రస్తుతం మన టాలీవుడ్ లో వస్తున్న బడా చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “వకీల్ సాబ్” కూడా ఒకటి. పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో ఈ చిత్రానికి సాలిడ్ రికార్డులు ఇవ్వాలని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యిపోయారు. ఇంకా అలాగే ఇప్పుడు కు కూడా పెద్ద టార్గెట్స్ నే పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచీ లీకుల బాధలు వెంటాడుతూనే ఉన్నాయి.

పవన్ పాల్గొన్న మొదటి రోజు షూట్ నుంచి ఆ మధ్య కొన్ని సీన్స్ వరకు అయితే ఫోటోనో లేక వీడియోనా ఏదోకటి వచ్చేసేవి. మరి ఇప్పుడు కూడా అలానే మరో వీడియో లీక్ అయ్యినట్టుగా వార్తలు గుప్పుమన్నాయి. అది కూడా టీజర్ అంటూ వదంతులు వచ్చాయి. అయితే ఇప్పుడు దానిలో డైలాగ్ పై రచ్చ నడుస్తుంది. అలాగే మరోపక్క అసలు ఎలాంటి వీడియో బయటకు రాలేదు అని కూడా వినిపిస్తుంది.

మొత్తానికి మాత్రం పవన్ కం బ్యాక్ మూవీ ఇలా లీకులతో పబ్బం గడుపుతుంది. మరి ఇంత జరుగుతున్నా మేకర్స్ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం అందించిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేతా థామస్ మరియు అంజలీలు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

Exit mobile version