“గేమ్ ఛేంజర్” మరో లీక్ వైరల్?

“గేమ్ ఛేంజర్” మరో లీక్ వైరల్?

Published on Jun 15, 2024 7:07 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అంజలి, కియార అద్వానీ హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అంతిమ దశలో ఉంది. మరి ఇన్నేళ్ల కెరీర్ లో శంకర్ తన సినిమాలు ఎంతో జాగ్రత్తగా కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు లీక్ లు తెగ బయటకు వస్తున్నాయి.

ఈ సినిమా నుంచి కూడా మొదటి నుంచి ఇప్పుడు వరకు కూడా చాలానే రాగా మరో లీక్ బయటకొచ్చి వైరల్ అవుతుంది. ఇందులో చరణ్ పై ఓ క్రేజీ సీక్వెన్స్ లీక్ అయినట్లు వినిపిస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా గేమ్ ఛేంజర్ తాలూకా లీక్ కాదని అంటున్నారు. అసలు ఆ వీడియోలో ఉన్నది చరణ్ కానే కాదని అంటున్నారు.

మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో ఈ లీక్ నిజమో కాదో కానీ మేకర్స్ అజాగ్రత్తైతే ఉంది. ఎప్పుడు నుంచో లీక్స్ వస్తున్నప్పటికీ వాటికి మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు