“వరిసు” నుంచి మరో లీక్ వచ్చిందా.?

“వరిసు” నుంచి మరో లీక్ వచ్చిందా.?

Published on Nov 15, 2022 10:14 PM IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “వరిసు” తెలుగులో “వారసుడు” పేరిట ప్లాన్ చేసి రిలీజ్ చేయనుండగా చిత్ర యూనిట్ అయితే ఈ మధ్య కాలంలో పలు లీక్ సమస్యలు స్టార్ట్ అయ్యాయి. సినిమా నుంచి ఆన్ లొకేషన్ వీడియోలే బయటకి వచ్చేస్తూ ఉండడం ఆసక్తిగా మారింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నుంచి మరో షూటింగ్ స్పాట్ వీడియో బయటకొచ్చి వైరల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే ఈ వీడియోలు సోషల్ మీడియా నుంచి కూడా తొలగించినట్టు కూడా టాక్. మరి దిల్ రాజు అయితే ప్రిస్టేజియస్ గానే ఈ ప్రాజెక్ట్ ని తీసుకున్నారని చెప్పాలి. అలాగే తమ బ్యానర్ నుంచి వస్తున్న రామ్ చరణ్ శంకర్ సినిమాకి కూడా ఇదే తరహా జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు అని కొందరి అభిమానుల అభిప్రాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు