నపూర్ తప్పుకోడానికి వేరే కారణం ఉందా?

Published on Sep 21, 2023 4:02 pm IST


టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు హీరోగా తన తండ్రి మంచు మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “భక్త కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి వారి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ నపూర్ సనన్ అయితే మొదట ఫిక్స్ అయ్యింది. కానీ ఊహించని విధంగా అయితే తమ సినిమా నుంచి ఆమె తప్పుకుంది అని డేట్స్ సరిగ్గా సెట్ కాకపోవడం మూలానే ఇది జరిగింది అని మంచు విష్ణు స్వయంగా చెప్పాడు.

అయితే ఈ విషయంలో మాత్రం నపూర్ నుంచి ఎక్కడా కూడా ఎలాంటి రెస్పాన్స్ కనిపించకపోవడం అనేది ఆశ్చర్యంగా మారింది అని చెప్పాలి. తన సోషల్ మీడియా ఏ ప్లాట్ ఫామ్ లో కూడా ఆమె ఈ సినిమా మిస్ చేసుకున్నందుకు పోస్ట్ లాంటిది చిన్న స్టోరీ కూడా పెట్టకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి వేరే కారణం కూడా ఉందా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. మరి నపూర్ ఎందుకు తప్పుకుందో అనేది మాత్రం కొందరిలో చర్చగా మారింది.

సంబంధిత సమాచారం :