ఓటీటీలో “బలగం”..కానీ హీరోకి తెలీదా?

Published on Mar 24, 2023 7:04 am IST

గత కొన్ని వారాల కితం టాలీవుడ్ సినిమా దగ్గర మరీ అంత హంగామా లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం “బలగం”. ప్రముఖ కమెడియన్ ఆర్టిస్ట్ ప్రియ దర్శి హీరోగా యంగ్ హీరోయిన్ కావ్యాకళ్యాన్ రామ్ హీరోయిన్ గా మన అందరికీ బాగా తెలిసిన టిల్లు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. మరి మొదటి రోజు చాలా తక్కువ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇక రెండో రోజు నుంచి అయితే మొదటి రోజుకన్నా తక్కువగా ఏ ఒక్క రోజూ అందుకోలేదు.

ఆ రేంజ్ హిట్ గా మారి ఇప్పుడు 20 రోజులకిపైగా సాలిడ్ థియేట్రికల్ రన్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాకి ఓటీటీ రిలీజ్ బ్రేక్ వేసేలా మారింది. అయితే ఆల్రెడీ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి ఈ సినిమా ఉండగా సినిమా హీరో ప్రియదర్శికే ఇది తెలియనట్టుంది. ఈ సినిమా రాత్రి 12 గంటల నుంచే స్ట్రీమింగ్ కి వచ్చిన సమయంలో అప్పటికే పెద్ద ఎత్తున టాక్ స్ప్రెడ్ కాదా దానిపై మాట్లాడుతూ అప్పుడే బలగం ప్రైమ్ వీడియోలో రావడం లేదని, అలాంటి బేస్ లెస్ వార్తలు నిజం కాదు అందరూ థియేటర్స్ లోనే ఎంజాయ్ చెయ్యండి అని అంటున్నాడు. మరి సినిమా ప్రైమ్ వీడియో లో వస్తున్నట్టు నిజంగానే తనకి తెలీదా ఏమో కాని దీనితో ఈ పోస్ట్ మాత్రం ఆసక్తి గా మారింది.

సంబంధిత సమాచారం :