నందమూరి నటసింహం బాలకృష్ణ తన అఖండ సినిమా నుంచి ట్రెండ్ మార్చి దేనికదే సాలిడ్ ప్రాజెక్ట్ లతో వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో తన 111వ సినిమా చేస్తుండగా ఈ సినిమా తర్వాత బాలయ్య మరో ఊహించని మ్యాడ్ కాంబినేషన్ తో రాబోతున్నట్టు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. మరి ఈసారి యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలయ్య రాబోతున్నారట.
అంతేకాకుండా ఈ సినిమాకి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కింగ్ ఆఫ్ కొత్త, సరిపోదా శనివారం, లేటెస్ట్ గా లోకా సినిమాల సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ బాలయ్యకి సాలిడ్ మ్యూజిక్ అందించనున్నారు అని తెలుస్తోంది. మరి ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం అభిమానుల్లో కూడా కొత్త ఊపు వస్తుందని చెప్పవచ్చు. సో దీనిపై అధికారిక క్లారిటీ ఒక్కటి రావాల్సి ఉంది.
