వైరల్ : పవన్ పార్టీలో ఎంట్రీపై బండ్ల గణేష్ ఇంట్రెస్టింగ్ రిప్లై.!

Published on Mar 30, 2022 1:30 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కోసం అందరికీ తెలిసిందే. అలాగే టాలీవుడ్ లో కూడా పవన్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరైనా ఉన్నారు అంటే అది బండ్ల గణేష్ అనే చెప్పాలి. పవన్ సినిమా వస్తుంది అంటే చాలు ఆ వేడుకలో పవన్ స్పీచ్ తో పాటు బండ్ల గణేష్ స్పీచ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తారు.

అయితే పవన్ సినిమాలతో పాటుగా తన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అలాగే బండ్ల గణేష్ కూడా ఆల్రెడీ రాజకీయాల్లోకి వెళ్లి ఇప్పుడు బయటకొచ్చి తన పని ఏదో తాను చేసుకుంటున్నారు. కానీ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో తాను ఇచ్చిన రిప్లై ఆసక్తిగా మారింది.

పవన్ మరియు బండ్ల గణేష్ ఫాలోవర్ పవన్ పార్టీ లోకి మెగాస్టార్ చిరంజీవి వస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చెయ్యగా బండ్ల గణేష్ మరి నేను? అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. దీనితో మళ్ళీ బండ్ల గణేష్ పొలిటికల్ రీఎంట్రీకి ఆసక్తిగా ఉన్నారని అనిపిస్తుంది. అందులోని పవన్ పార్టీ లోకే వెళ్ళడానికి ఓకే అన్నట్టు హింట్ ఇస్తున్నారని చెప్పాలి. మరి నిజంగానే బండ్ల పవన్ పార్టీ లో ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :