టాక్..చరణ్ కూడా 10వేల టికెట్లు.?

Published on Jun 9, 2023 8:04 am IST


ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ హిస్టారికల్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం విషయంలో అయితే పాన్ ఇండియా నిర్మాత అభిషేక్ అగర్వాల్ అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ లు తమ వైపు నుంచి ఒకోకరు 10 వేల టికెట్స్ ని పేదవారికి అనాథలకు ఇచ్చి వారికి “ఆదిపురుష్” చిత్రాన్ని చూపిస్తున్నట్టుగా వచ్చిన వార్తలు ఇపుడు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

మరి లేటెస్ట్ గా అయితే మన టాలీవుడ్ నుంచి గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే డెసిషన్ తీసుకోనున్నారని తాను కూడా 10 వేల టికెట్స్ ని అయితే అనాథ పిల్లల కోసం పంచనున్నారని ఇప్పుడు ఓ టాక్ వైరల్ మారుతుంది. అయితే ప్రస్తుతానికి ఇందులో ఎలాంటి నిజం లేదు కానీ ఆల్ మోస్ట్ నిజం కావచ్చని కూడా అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :