టాక్..”ఆదిపురుష్” ఈవెంట్ డేట్ లో మార్పు.?

Published on May 7, 2023 7:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో రిలీజ్ కి ఆల్రెడీ సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ రామాయణం ఆధారంగా భారీ విజువల్స్ తో తెరకెక్కింది. మరి ఈ అవైటెడ్ సినిమాలో ప్రభాస్ రామునిగా నటించగా ఇప్పుడు దేశం అంతా కూడా ఈ సినిమా మాసివ్ ట్రైలర్ కట్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి గాను మేకర్స్ భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఈ జూన్ 1న అయితే తిరుపతిలో కూడా ఓ గ్రాండ్ ఈవెంట్ ని ప్లాన్ చేసినట్టుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ డేట్ మారినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మేకర్స్ ఈ ఈవెంట్ ని జూన్ 1 నుంచి తప్పించి తిరుపతిలో జూన్ 3న అయితే చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమా అయితే ఈ జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :