“డాక్టర్ స్ట్రేంజ్” కొత్త సినిమాకి ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిందా?

Published on May 21, 2022 5:04 pm IST

హాలీవుడ్ సినిమాల్లో భారీ వసూళ్లను రాబట్టగలిగే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది మార్వెల్స్ సంస్థ అని చెప్పాలి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మొదలైన మరో పేజ్ తో ఒక్కో సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నాయి. చాలా వరకు కొత్త ముఖాలే పరిచయం అవుతున్నా కూడా సక్సెస్ అవుతూ ఆడియెన్స్ ని మంచి ట్రీట్ ఇస్తున్నాయి.

అలా లాస్ట్ ఇయర్ అయితే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ వసూళ్ళని అందుకుంది. ఇక దాని తర్వాత మళ్ళీ భారీ అంచనాలతో వచ్చిన లేటెస్ట్ సినిమానే “డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీ వర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్”. ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ వసూళ్లతో దూసుకెళ్తుండగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై టాక్ వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే ఈ చిత్రం ఈ జూన్ మూడో వారంలో ఏదొక డేట్ నుంచి స్ట్రీమింగ్ కి రానుందట. అలాగే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ సహా భారతీయ కీలక భాషల్లో డిస్నీ+ హాట్ స్టార్ లోనే స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ డేట్ పై అయితే అధికారికంగా ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :