టాక్..”సర్కారు వారి పాట” నెక్స్ట్ ట్రీట్ కి డేట్ ఫిక్స్.?

Published on Mar 4, 2022 6:01 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ ని రీసెంట్ గానే రిలీజ్ చెయ్యగా దానికి భారీ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక దీనితో థమన్ ఇచ్చిన రెండో సాంగ్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి దానికి ఈ మార్చ్ లోనే ముహూర్తం కుదిరింది అని టాక్ వినిపించగా ఇప్పుడు దానికి డేట్ కూడా వినిపిస్తుంది. మరి దీని ప్రకారం ఈ మార్చ్ 18న డేట్ లాక్ అయ్యినట్టుగా ఇప్పుడు బజ్ వినిపిస్తుంది. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :