టాక్..”సార్” అవుట్ పుట్ పై ధనుష్ ఫుల్ హ్యాపీ.?

Published on Feb 8, 2023 10:00 am IST

కోలీవుడ్ వెర్సటైల్ హీరో మరియు గ్లోబల్ స్టార్ అయినటువంటి ధనుష్ హీరోగా ఇప్పుడు అనేక సినిమాలు తాను చేసేస్తున్నాడు. తమిళ్ సహా తెలుగులో కూడా ధనుష్ పలు చిత్రాలు లాక్ చేస్తూ వెళ్లిపోతుండగా ఈ చిత్రాల్లో మన టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి తో చేసిన ఇంట్రెస్టింగ్ చిత్రం “వాతి” కూడా ఒకటి. మరి తెలుగులో “సార్” పేరిట ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై తెలుగు మరియు తమిళ నాట మంచి బజ్ నెలకొంది.

రీసెంట్ గా తమిళ్ లో గ్రాండ్ ఆడియో ఫంక్షన్ కూడా ఈ సినిమాకి జరిగింది. అయితే ఈ సినిమా అవుట్ పుట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ధనుష్ కి ఈ సినిమా అవుట్ పుట్ బాగా నచ్చిందట. దీనితో ఈ సినిమా విజయం సాధిస్తుంది అని తాను కాన్ఫిడెంట్ గా ఉన్నాడని తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ఫిబ్రవరి 17 న అయితే రిలీజ్ కానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :