క్రేజీ..ధోని సినిమా ఎంట్రీ ఇస్తున్నాడా? వైరల్ గా ఆ దర్శకుని పోస్ట్.!

Published on Feb 20, 2022 3:49 pm IST


మన దేశంలో ప్రజలు ఎంతో అమితంగా ప్రేమించే కొన్ని అంశాల్లో సినిమా అలాగే క్రికెట్ ప్రధానంగా ఉంటాయని చెప్పాలి ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. మరి ఇలా సినిమాల్లో అటు క్రికెట్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్ ఉంటారు. అలా భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అతి కొద్ది క్రికెటర్స్ లో మన దేశపు మాజీ క్యాప్టెన్ ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ టీం సారధి మహేంద్ర సింగ్ ధోని కూడా ఒకరు.

అయితే ధోని పలు టీవీ యాడ్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే డీసెంట్ గా ఓ కామిక్స్ కి గాను క్యారెక్టర్ గా కూడా తాను కనిపించదు. కానీ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఓ రేంజ్ లో సస్పెన్సు గా మారింది. కోలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ ఎం ఎస్ ధోని ని కలవడం జరిగింది. కలిసాక తాను చాలా ఎగ్జైటింగ్ గా తన స్పందనను తెలియజేసారు.

నా రోల్ మోడల్, నా హీరో ని కలిసాక ఏ క్యాప్షన్ కూడా ఆ ఆమాటలను చెప్పలేదని అలాగే ధోని ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది తనకి “యాక్షన్” చెప్పబోతున్నానని తాను తెలిపాడు. దీనితో ఇక్కడ నుంచి అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ ఇద్దరు నుంచి సినిమా వస్తుందా ఏంటి అని అంతా అనుకుంటున్నారు. అలాగే ఇంకో పక్క బహుశా యాడ్ కోసమా అని కూడా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే ధోని సినిమా ఎంట్రీ అంటూ హడావుడి నడుస్తుంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతుందో అనేది.

సంబంధిత సమాచారం :